పత్తికొండ మండలంలోని దేవనబండ, జూటూరు, చిన్నహుల్తి గ్రామాలలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తరువాత రెండు మోటారు సైకిళ్లపై ఆరుగురు ఒక్కసారిగా గ్రామాల్లోకి చొరబడి దోపిడీ చేశారు. దేవనబండ గ్రామంలో వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తింటి రామిరెడ్డి ఇళ్లలో, పోస్ట్ ఆఫీస్‌లో దొంగలు దొరికిన కాడికి దోచుకున్నారు. వెంకటేశ్వర్ రెడ్డి ఇంటిలో 5 తులాల బంగారం, 2 కేజీల వెండి, నా...Read more
కొత్తపల్లి మండల కేంద్రంలో నెలకొన్న అతిసార రెండో రోజు తగ్గుముఖం పట్టింది. డిఎల్‌పిఒ తిమ్మక్క మంగళవారం కొత్తపల్లికి చేరుకుని అతిసార బారిన పడిన గ్రామస్తులను పరామర్శించారు. ముందుగా గ్రామంలో అతిసార ప్రబలడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పలుచోట్ల ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో గత రెండు రోజుల కాలం నుండి కలుషిత నీరుతాగి ప్రజల...Read more
కర్నూలు సబ్ రిజిస్ట్రార్‌గా ఎస్.మహబూల్ అలి తన వద్ద పని చేస్తున్న షమీర్ బాషా ద్వారా లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎసిబి డిఎస్పి నాగభూషణం తెలిపిన వివరాల మేరకు... కర్నూలు నగరం బుధవారపేట హిమాలయ మెడికల్ స్టోర్ నిర్వహకుడు ...Read more
వరుస కరువులతో 2018-19లో నష్టపోయిన రైతులకు కరువు పంట నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లా నాయకులు జివి .ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ధర్నాలో జి.రామకష్ణ మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం రైతులు వేసిన పంటలన్నీ ...Read more
స్పందన కార్యక్రమంలోని ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు వారాల ముందు స్పందన అర్జీల పరిష్కారం మెరుగ్గా ...Read more
ఆలూరులో గత ఆరు నెలల నుంచి వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గత నెల విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో ఉన్న పాన్ దుకాణంలో రూ.10 వేలు విలువ చేసే సరుకులు, ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా ఉనన శారదమ్మ పాన్ దుకాణంలో రూ.5 వేల సరుకులు, రూ.600 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. గుండన్న పాన్ దుకాణంలో రూ.వెయ్యి సరుకులు చోరీ చేశారు. మూడు నెలల క్రితం ఈరన్న సిమెం...Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ.గఫూర్ పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు 11వ జిల్లా మహాసభల సందర్భంగా వివిధ రంగాల కార్మికులు కర్నూలు అంబేద్కర్ భవన్ నుంచి భారీ ప్రదర్శన చేశారు. ప్రదర్శన జిల్లా పరిషత్, కిడ్స్ వరల్డ్, పూలబజార్, పెద్దమార్కెట్ మీదుగా పాతబస్టాండ్‌లోని ఓపెన్...Read more