మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
ప్రజశక్తి-రాయచోటి టౌన్
ఇటీవల గుండెపోటుతో మతి చెందిన రాయచోటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆప్జల్ అలీఖాన్ కుటుంబాన్ని మంగళవారం సాయంత్రం మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ జడ్పీవైస్‌చైర్మన్ దేవనాధ రెడ్డి, డి సిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద్ రెడ్డిలతో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అతని మతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపి వారి కుటుంభ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుడు తమకు మంచి ఆత్మీయుడని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, ప్రస్తుతం మన మధ్యలేకపోవడం చాలా బాధాకరమన్నారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తామందరము కలసి అండగా ఉంటామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు సలావుద్దీన్, బషీర్ ఖాన్, జ మాల్ ఖాన్, దశరథ రామిరెడ్డి, అలీనవాజ్ ఖాన్, ఉదరుకు మార్రెడ్డి, మదన మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వండాడి వెంకటేశ్వర్లు, కంచంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగసుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కొలిమి ఛాన్ బాష, జాకీర్, ఫయాజ్ అహమ్మద్, ఎస్‌పిఎస్ రిజ్వా న్, సాదిక్, హాబీబ్, చెన్నూరు అన్వర్ బాష, సలీం, నవరంగ్ నిస్సార్, నాగరాజు యాదవ్, చిల్లీస్ ఫయాజ్, గంగిరెడ్డి, రియాజుర్ రెహమాన్, నరసింహారెడ్డి, రంగారెడ్డి, రమణారెడ్డి, రియాజ్, విక్కీ దేవేంద్ర, అమీర్, ఇమ్రాన్, జావీద్, జబీవుల్లా, ఇంతియాజ్, తబ్రెజ్, నవాజ్ క్రిష్, తాజ్ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
