చికాగో : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చికాగో రాష్ట్రంలో గురువారం దాదాపు 24 వేల మందికి పైగా ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది సమ్మె బాట పట్టారు. క్లాసుల్లో విద్యార్థుల సంఖ్యను కుదించాలని, నర్స్‌లు, లైబ్రేరియన్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర సిబ్బందిని నియ మించాలని, వేతనాలు పెంచాలని, స్కూళ్లలో పరిస్థితులను మెరుగుపర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల విరామం తరువాత డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పోరు బాట పట్టటం విశేషం. విద్యారంగ సమస్యలపై 2012లో టీచర్లు కొనసాగించిన ఉధృత స్థాయి పోరాటం తరువాత ఇంత భారీ సంఖ్యలో ఉద్యమ బాట పట్టటం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆరంభం నుండి లాస్ఏంజెల్స్, ఆక్లండ్, డెన్వర్ వంటి రాష్ట్రాలలో దాదాపు నాలుగోవంతు మంది బోధకులు రోడ్డున పడగా వర్జీనియా, అరిజోనా, కరోలినా,కెంటకీ తదితర రాష్ట్రాలలో బంద్ పాటించారు. క్రొయేషియాలో మెరుగైన వేతనాల కోసం దాదాపు 70 వేల మందికి పైగా టీచర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూనివర్శిటీ అధ్యాపకులు వారితో జతకలిసేందుకు సిద్ధమవుతున్నారు. జోర్డాన్‌లో మెరుగైన వేతనాల కోసం సమె బాట పట్టిన దాదాపు లక్ష మందికి పైగా టీచర్లు ఇటీవల తమ నెలరోజుల సమ్మెను ముగించిన విషయం తెలిసిందే. మంగళ వారం నుండి ఇదే సమస్యపై అల్జీరియన్ టీచర్లు సమ్మె బాట పట్టారు.
చికాగోలో టీచర్ల సమ్మె
