ప్రజాశక్తి - విశాఖపట్నం
పోలీస్ వ్యవస్థలో సరికొత్త మార్పునకు విశాఖ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ మహా నగరంలో రోబో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మహరాణిపేట పోలీస్ స్టేషన్లో సైబీరాగా పిలవబడే ఈ రోబో అందుబాటులో ఉంది. ఆన్లైన్లో ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరవేయడం దీని విధి. మౌఖికంగానూ సమస్యలను ఇది తీసుకుంటుంది. ఫిర్యాదు ఎవరు చేశారో వారి ఫొటో కూడా తీస్తుంది. అంతే కాకుండా ఆ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో వెంటనే తెలియజేస్తుంది. విశాఖకు చెందిన రోబో కఫ్లర్ ప్రయివేటు సంస్థ దీన్ని తయారు చేసింది. రూ.8.7 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.