కావలసినవి: పెసలు, సెనగలు, బొబ్బర్లు, జొన్నలు, బియ్యం, కందులు, గోధుమలు, సజ్జలు, ఉలవలు: టేబుల్‌స్పూను చొప్పున, బెల్లంతురుము: 2 కప్పులు, యాలకులపొడి: టీస్పూను, పాలు: లీటరు, జీడిపప్పు: రుచికి సరిపడా, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం: నేతిలో జీడిపప్పు, బాదంపప్పు వేసి వేయించాలి. పెసలు, సెనగలు, బొబ్బర్లు... అన్నీ కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు వీటిలో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఓ మందపాటి గిన్నెలో పాలు పోసి సగమయ్యే వరకూ మరిగించాలి. తరవాత ఉడికించిన నవధాన్యాలు, బెల్లంతురుము వేసి ఉడికించాలి. యాలకులపొడి కూడా వేయాలి. చివరగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు ముక్కలు వేసి కలిపితే సరి.