కావాల్సిన పదార్థాలు
చింతపండు-నిమ్మకాయంత
కందిపప్పు-5 టీస్పూన్లు
వెల్లుల్లి రేకలు-4
పసుపు-1టీ స్పూన్
ఎండుమిర్చి-3
పచ్చిమిర్చి-2
బెల్లం-1టేబుల్ స్పూన్
ఇంగువ-చిటికెడు
కరివేపాకు రెబ్బలు-8
నూనె-1టేబుల్ స్పూన్
ఆవాలు-1టీ స్పూన్
ఉప్పు-తగినంత
నీరు -రెండు కప్పులు
తయారుచేసే విధానం
ముందుగా వేడినీటిలో చింతపండును వేసి 20 నిమిషాలు వుంచాలి. ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో చింతపండు రసం, రెండు కప్పుల నీరు, కందిపప్పు వేసి బాగా వుడికించాలి. అందులో వెల్లుల్లి రేకలు, మిరియాలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, పసుపు, బెల్లం, ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేసి పది నిమిషాలపాటు మరగనిచ్చి స్టౌపై నుంచి దించేయాలి. ఇప్పుడు ఒక పాన్లో పోపు వేసుకుని ముందుగా తయారుచేసి పెట్టుకున్న రసంలో వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి రసంపై కొద్దిసేపు మూత పెట్టివుంచాలి. అన్నంతో లేదా సూప్లా కూడా పోండు రసాన్ని తీసుకోవచ్చు.