హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇవాళ్టికి 42వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని రక్షించాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఈనెల 16న ఇందిరాపార్క్ వద్ద జేఏసీ నేతలు దీక్ష కార్యక్రమం, 17, 18 తేదీల్లో అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.. 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.
నేడు ఆర్టీసీ జేఏసీ బైక్ ర్యాలీ
