కావల్సినవి : సేమియా - ఒక కప్పు కోరిన పచ్చికొబ్బరి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
తయారీ : కడాయిలో నెయ్యిని వేడిచేసుకుని సేమియాను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించి పంచదార, యాలకుల పొడితో పాటు అరకప్పు నీటిని వేసి అడుగంటకుండా తిప్పుతుండాలి. పాకం చిక్కగా అయ్యాక కొబ్బరి తురుముని వేసి మళ్లీ తిప్పాలి. సేమియా గట్టి పడ్డాక నెయ్యిరాసిన పళ్లెంలో వేసి మనకు నచ్చిన ఆకారాల్లో కోసుకుని చల్లారాక విడదీసి పెట్టుకోవాలి. ఇవి కొన్నాళ ్లపాటు నిలవుంటాయి.