- బంగ్లా చేతిలో భారత్ ఓటమి
సావర్(బంగ్లాదేశ్): ఎసిసి ఎమర్జింగ్ టీమ్స్ కప్ వన్డే క్రికెట్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగిన ఈ పోటీలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు 50 ఓవర్లలో 246 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా జట్టు 42.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. ఇటీవల భారత్‌తో టీ20 ఆడిన సౌమ్య సర్కార్ బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడు 68 బంతుల్లో 73 పరుగులు చేయగా... కెప్టెన్ నజ్ముల్ హొసైన్ 88 బంతుల్లో 94 పరుగులు చేసి బంగ్లాకు విజయాన్ని సంపాదించిపెట్టారు. 20 ఏళ్ల నజ్ముల్ నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన టీ20లో 81 పరుగులు చేసి రాణించిన సంగతి తెలిసిందే.
ఎసిసి ఎమర్జింగ్ టీమ్స్ కప్
