- యాషెస్ సిరీస్ రెండోటెస్ట్
లండన్ : ఇంగ్లండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండోటెస్ట్ తొలిరోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కనీసం టాస్ వేయకుండా వరుణుడు అడ్డుకున్నాడు. లంచ్ సమయానికి వర్షం తగ్గకపోవడం, టీబ్రేక్ తర్వాత అయినా మ్యాచ్ ప్రారంభించా లని అంపైర్లు శతవిధాలా ప్రయత్నించినా ఔట్ ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారడంతో కవర్లను అలాగే కప్పి ఉంచారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఆసీస్ 251 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆండ ర్సన్ రెండోటెస్ట్‌కు కూడా దూరం కావడంతో జోప్రా ఆర్చర్ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
తొలిరోజు వర్షార్పణం
