కొత్తతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి అని చాలా చిత్రాలు నిరూపించాయి. అలాంటి సబ్జెక్ట్‌తో శుక్రా ప్రొడక్షన్ బ్యానర్లో మిషాన్ జైన్, హేమలతా రెడ్డి హీరో, హీరోయిన్లుగా రాబోతున్న చిత్రం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకొంది. పాటల చిత్రీకరణకు సిద్ధమవుతుంది. కంటెంట్ బేసెడ్ సినిమాగా ఇండిస్టీలో బజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత సంజరు జాదవ్ తెలిపారు.
దర్శకుడు వి ఎస్ ఫణీంద్ర మాట్లాడుతూ 'ఇప్పటి ట్రెండ్‌కు తగిన అంశాలతో సినిమా రూపొందుతుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటాయి. కథకు యూత్ బాగా రిలేట్ అవుతారు. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ చాలా సంతృప్తిగా ఉంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకం ఉంది. రాజా రవీంద్ర కీలక పాత్రను పోషిస్తున్నారు. సినిమా పిబ్రవరి 4నుండి ఫైనల్ షెడ్యూల్‌కి వెళుతుంది' అని పేర్కొన్నారు.
కొత్తతరం ఆలోచనలు
