'బాణం' చిత్రం నారా రోహిత్‌కు, దర్శకుడు చైతన్య దంతులూరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో మరే చిత్రమూ చేయలేదు. ఇన్నాళ్లకు వారి కలయికలో మరో చిత్రం రాబోతుంది. ఈసారి 1971 కాలంలో సాగే పీరియాడిక్ కథతో రాబోతున్నారు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దర్శకుడిగా తన మొదటి చిత్రమైన 'బాణం'తో చైతన్య దంతులూరి మంచి పేరు తెచ్చుకున్నా ఆ తరువాత 'బసంతి' చిత్రంతోనూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయినా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.