రారు లక్ష్మీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. కిషోర్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుండి 'పాప నీకేదంటే ఇష్టం' అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. 'ఖైదీ నెం 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించిన రారు లక్ష్మి, మళ్లీ 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది. 'రంగస్థలం' ఫేమ్ పూజిత పొన్నాడ కూడా ఇందులో కీలకపాత్రను పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, మహాత్, పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని హాస్యం ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చిత్రబందం నమ్మకంగా చెబుతుంది.
పాప నీకేదంటే ఇష్టం...
