కావలసినవి : బ్లెడ్ స్లైసులు: పది, వంటసోడా: చిటికెడు, పంచదార: కిలో, కోవా: 200గ్రా., జాజికాయపొడి: పావుటీస్పూను, జాపత్రిపొడి: పావుటీస్పూను, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం : కోవాను మెత్తగా చిదమాలి. బ్రెడ్ అంచులను పొడిలా చేయాలి. ఈ బ్రెడ్ పొడి, చిదిమిన కోవా, వంటసోడా అన్నీ వేసి కలపాలి. అందులోనే జాజికాయ, జాపత్రి పొడులు కూడా వేసి కలిపి ఉండలు చేయాలి. ఇప్పుడు ఒక్కో ఉండ చుట్టూ అంచులు తీసిన బ్రెడ్ స్లైసుల్ని చుట్టినట్లుగా అతికించాలి. బ్రెడ్ముక్కల్ని తడిబట్టమీద వేసి ఉంచితే అవి బాగా అతుక్కుంటాయి. ఓ గిన్నెలో పంచదార వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి లేతపాకం రానిచ్చి దించాలి. ఓ బాణలిలో నూనె పోసి కాగాక బ్రెడ్ ఉండలను వేయించి పంచదార పాకంలో వేసి చల్లారాక వడ్డించాలి.