కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు - 1 కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు, జీడిపప్పు - 1 కప్పు, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు
తయారీ విధానం: ఖర్జూరాలను విత్తనాలు తీసి గంటపాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత ఆరబెట్టి పక్కనుంచాలి. జీడిపప్పులో కొబ్బరి కలిపి, బ్లెండ్ చేయాలి. దీన్లోనే ఖర్జూరాలు, కొబ్బరి నూనె కూడా వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అదంతా చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేతితో ఉండలు చుట్టాలి. వీటిని ఫ్రిజ్లో చల్లబరిచి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.