కావల్సినవి: చికెన్ - 600 గ్రాములు, పెరుగు - 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, బెల్లం లేదా పంచదార - 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ - 1, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు రెమ్మలు - 5, ఎండు మిర్చి - 10, జీలకర్ర - టీస్పూన్, మెంతులు - పావు టీస్పూన్, ధనియాలు - 1 టేబుల్ స్పూను, పచ్చికొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (వేగినవి), సోంపు - టీ స్పూన్, లవంగాలు - 2, దాల్చిన చెక్క - 2, నిమ్మరసం - 1 టే.స్పూన్లు, చింతపండు గుజ్జు - టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసేప్పుడే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4 కప్పు నీళ్ళు పోసి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి. ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ..!