కౌలు రైతుకు పెట్టుబడి సహాయం, సబ్సిడీలు, పంట రుణాలకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. కౌలు రైతులంటే ఎకరా, రెండెకరాలు సొంతానికి లేదా కొంత అదనంగా కౌలుకు తీసుకుని సాగు చేసే చిన్న, సన్నకారు రైతులే కాదు. సెంటు భూమి కూడా లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు కూడా. కౌలు ధ్రువీ కరిస్తూ సంతకం చేస్తే బ్యాంకు రుణాలు తెచ్చుకోవడం కష్టమవుతుందని రైతులు కౌలు రాసివ్వడం లేదు. దీంతో పంటలో నష్టమొస్తే ఎక్కడ తెచ్చి చెల్లిస్తారంటూ బ్యాంకులు పంట రుణం ఇవ్వడం లేదు. మరి కౌలు రైతులు అప్పులు ఎలా చెల్లించాలి? అందుకే ప్రభుత్వమే హామీ వుండి కౌలు రైతుకు పెట్టుబడి సమకూర్చేలా ప్రణాళికలు చేయాలి. అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకునే వరకు చోద్యం చూడకుండా పూర్తి బాధ్యత తీసుకోవాలి.
- ఎన్ కోటేశ్వరరావు, ప్రకాశం జిల్లా.
పంట నష్టమొస్తే అప్పు తీర్చేదెలా!
