- బెంగాల్ ఐద్వా సభలో బృందాకరత్
ప్రజాశక్తి ప్రతినిధి-కోల్కతా
దేశ రాజ్యాంగంపై దాడిని సహించేది లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. మన దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక భావనలను రక్షించుకోవాల్సిన అవసరముందని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, హౌరాలోని బాలిలో ఆ రాష్ట్ర ఐద్వా శాఖ 28వ వార్షికోత్సవ సదస్సును శుక్రవారం బృందాకరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న సాకుతో జార్ఖండ్లో 10 వేల మంది గిరిజనులపై పోలీసు కేసులు నమోదు చేయడం దారుణమైన అంశమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ నేతృత్వంలో అసమర్ధ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఉపాథి కోసం ఎదురు చూస్తున్న వారిలో 27 శాతం మంది మహిళలకు ఉద్యోగాలే రావడం లేదని, దాదాపు పదివేల మంది మహిళలు చిత్రహింసలకు గురువుతున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఐద్వా అధ్యక్షురాలు మరియం ధావ్లే మాట్లాడుతూ అధికార పార్టీ గూండాలను రాష్ట్ర మహిళలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డెబ్లీనా హేమ్రమ్ కూడా ఈ సభలో ప్రసంగించారు.
రాజ్యాంగం పై దాడిని సహించేది లేదు
