ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టిసి కాంప్లెక్స్‌లో పోలీసు అవుట్ పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పి ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. శుక్రవారం అవుట్ పోస్టు ఏర్పాటుకు సంబంధించి ఎస్పి స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ఆర్టిసి కాంప్లెక్సును సందర్శించారు. కాంప్లెక్సు ఆవరణలోని గుణుపూర్ బస్టాండ్ సమీపంలో అవుట్ పోస్ట్ పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎస్పి నిర్ధారించారు. ఈ మేరకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేసి తేదీ ఖరారు చేయాలని ఆర్టిసి అధికారులకు ఎస్పి ఆదేశించారు. ప్రయాణికులతో పాటు కాంప్లెక్స్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించడంలో అవుట్ పోస్ట్ పోలీసులు సహకరిస్తారని ఆయన తెలిపారు. ఈయనతో పాటు డిఎస్పి ఎ.ఎస్.చక్రవర్తి, సిఐ శంకరరావు, బి.ఎల్.పి.రావు, ఆర్టిసి ఉద్యోగులు తదితరులు ఉన్నారు.
ఆర్టిసిలో అవుట్‌పోస్ట్
