పారిశుధ్య కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-నక్కపల్లి
గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ గార్డ్సులకు బకాయి జీతాలు చెల్లించాలని సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుధ్యం కార్మికులు ధర్నా చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేదిలేదని కార్యాయలం వద్ద బైఠాయించారు. పంచాయతీ కార్యదర్శులతో ఎంపిడిఒ చర్చించారు. 2018 అక్టోబర్ నుంచి 2019 జూన్ వరకు 9 నెలలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి జీతాలు చెల్లిస్తామని, నిధులు రావడం ఆలస్యమైతే పంచాయతీల జనరల్ ఫండ్ నుంచి జీతాలు చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఎంపిడిఒ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దీనికి ముందు సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఏడాది కాలం నుంచి పారిశుధ్యం కార్మికులకు జీతాలు చెల్లించకపోతే వారెలా బతుకుతారని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని, సబ్బులు, నూనె, షూలు, రెండు జతల యూనిఫారమ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపిడిఒ రమేష్ రామన్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మనబాల రాజేష్, పంచాయతీ కార్మికులు లోవరాజు, డి.కృష్ణ, గోవిందు, చిన అబ్బాయి, లోవరాజు, సూరిబాబు, వరలక్ష్మి పాల్గొన్నారు
పారిశుధ్య కార్మికుల ధర్నా
