కెవిఆర్లో హాస్టల్ వసతి కల్పించాలి : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-కర్నూలు ఎడ్యుకేషన్
కెవిఆర్ జూనియర్ కళాశాల స్థలం సమస్యను పరిష్కరించి, హాస్టల్ వసతి కల్పించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నందున ముందుగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాష్, అబ్దుల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దష్టికి విద్యారంగ సమస్యలను తీసుకెళ్లాలనుకుంటే అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రిని ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్ మాట్లాడారు. కెవిఆర్ జూనియర్ కళాశాలకు రెండు ఎకరాల స్థలం కేటాయిస్తూ స్వయంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలను అమలు చేయకుండా జిల్లా అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలను బేఖాతరు చేశారని మంత్రి వివరించారు. కెవిఆర్ జూనియర్ కళాశాలలో దాదాపుగా 1000 మంది విద్యార్థినులు చదువుతున్నారన్నారు. హాస్టల్ అందుబాటులో లేక చాలా మంది విద్యార్థినులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ జూనియర్ కళాశాలకు కేటాయించి రెండెకరాల స్థలాన్ని అప్పగించి వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని కోరారు. స్పందించిన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామకష్ణ, రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్షుడు రవి, ప్రసాద్, మోహన్, రంగా పాల్గొన్నారు.
కెవిఆర్లో హాస్టల్ వసతి కల్పించాలి : ఎస్ఎఫ్ఐ
