పెద్దాపురం : పెద్దాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట, రంగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బాణసంచా తయారీదారులు, అమ్మకందారులు నిబంధనలు పాటించకపోతే వారిపై చర్యలు తప్పవని సిఐ వి.శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బాణసంచా తయారీదారులు, అమ్మకందారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లైసెన్స్ లేకుండా బాణాసంచా తయారు చేయడం, విక్రయించడం నేరమన్నారు. లైసెన్స్ పొందిన వారు బాణాసంచా తయారీ కేంద్రం వద్ద నియమ నిబంధనలు ప్రకారం అన్ని జాగ్రత్తలూ పాటించాలన్నారు. తాము ఎప్పటికప్పుడు ఈ కేంద్రాలను తనిఖీ చేస్తామని నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి.సురేష్ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
