రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
ప్రజాశక్తి - వేముల
మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన మేడా గణేష్‌కుమార్ (28) తన ఉద్యోగం రీత్యా గురువారం తన స్వగృహం నుండి పులివెందులలోని సంచుల ఫ్యాక్టరీకి వెళ్తుండగా పులివెందుల - కడప మార్గమధ్యలో ఉన్న వేముల పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా ఉన్న ఇటాచ్చిని బైకు ఢకొీనడంతో ఆయన అక్కడ ిక్కడే మృతి చెందారు. వివరాలలోకి వెళ్లితే. రోజు మాదిరిగానే ఉద్యోగ రీత్యా పులివెందులలోని సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజు లాగే ఉద్యోగానికి వెళ్లడానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో ఇటాచ్చి వాహనం ఢకొీ ని అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. విష యం తెలుసుకొన్న వేముల ఎస్ఐ జి. మధుసూధన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో స్థానిక పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. దీంతో మృతు ని తల్లిదండ్రులు సాయికుమార్, వెంకటసుబ్బమ్మ శోకసంద్రంలో ముగినిపోయారు. అతనికి తమ్ముడు కూడా ఉన్నారు. వేముల ఎస్ఐని వివరణ కోరగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
