గండేపల్లి : ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలోని మూడు రోజుల మొబైల్ అప్లికేషన్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్టు కళాశాల ప్రిన్సిపల్ ఎస్టివిఎస్.కుమార్ తెలిపారు. ఆదిత్య పాలిటెక్నిక్, ఎపి నైపుణ్యాల అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి శనివారం వరకూ నిర్వహించిన కార్యక్రమంలో మొబైల్ రంగంలో ఉద్యోగావకాశాలు, మొబైల్ రంగంలో నూతన అప్లికేషన్లను విద్యార్థులకు వివరించారు. కమ్యూనికేషన్ రంగంలో మొబైల్ ఫోన్ రాకతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, విద్యార్థులు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అనుభవపూర్వక జ్ఞానం పొందడానికి వర్క్ షాప్‌లు ఎంతో దోహదం చేస్తాయని నైపుణ్య అభివృద్ధి సంస్థ సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనేక మందికి నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుందని వారిలోని ప్రతిభ మెరుగు పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్ఎస్డిసి, సిబ్బంది, వైస్ ప్రిన్సిపల్ ఎ.మాధవరావు పాల్గొన్నారు.
ఆదిత్య పాలిటెక్నికల్ కళాశాలలో మొబైల్ అప్లికేషన్ వర్క్‌షాప్
