కావాల్సినవి : సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, మ్యారీ బిస్కెట్లు - ఒక ప్యాకెట్, పంచదార - ఆరు టేబుల్స్పూన్లు.
తయారీ :
ముందుగా పాలు మరిగించి, చల్లారబెట్టాలి. బిస్కెట్లను పొడి చేసుకోవాలి. తరువాత సీతాఫలాల విత్తనాలు తీసేసి గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో పాలు తీసుకుని, అందులో మ్యారీ బిస్కెట్ల పొడి వేయాలి. తరువాత సీతాఫలం గుజ్జు, పంచదార వేసి గ్రైండ్ చేయాలి. కొద్దిసేపటికి మిశ్రమం చిక్కగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గిన్నెల్లో లేదా ఐస్క్రీమ్ కప్పుల్లో పోసి ఫ్రిజ్లో పెట్టాలి. చల్లబడిన తరువాత సర్వ్ చేసుకోవాలి.
సీతాఫలం ఐస్ క్రీం
