కావలసినవి: పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; బొగ్గు ముక్కలు – 2; కరివేపాకు – 5 ఆకులు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (సన్నగా తరగాలి); నూనె – ఒక టీ స్పూను.
తయారీ:
►మిక్సీలో పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు వేసి తిప్పాలి
►కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి
►మజ్జిగను ఒక పాత్రలోకి తీసుకోవాలి
► ఒక పాత్రలో కరివేపాకు, పచ్చి మిర్చి, జీలకర్ర ఉంచాలి
► బొగ్గును స్టౌ మీద కాల్చి, ఆ బొగ్గును చిన్న పాత్రలోకి తీసి, వెంటనే ఆ పాత్రను మజ్జిగ మీద ఉంచాలి
► నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రలను మండుతున్న బొగ్గు మీద వేసి సిల్వర్ ఫాయిల్‌తో వెంటనే మూసేయాలి
► బొగ్గు మీద నుంచి వచ్చే పొగ మజ్జిగలోకి చేరి, కొత్త రుచి వస్తుంది
► ఐదు నిమిషాల తరవాత సిల్వర్ ఫాయిల్ తీసేయాలి
► బొగ్గును తీసి పడేయాలి
►మజ్జిగను గ్లాసులలోకి పోసి, పుదీనా ఆకులతో అలంకరించి అందించాలి.