- గుంజుకునే హక్కు మీకెక్కడిది?
- పోలీసు రాజ్యంతో ఎక్కువ కాలం పాలన చేయలేరు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగయ్య
ప్రజాశక్తి - హైదరాబాద్
'తరతరాలుగా ఈ మట్టినే నమ్ముకుని బతుకుతున్నరు.. కరువులోనూ.. కాటకాల్లోనూ ఈ నేలనిడువలేదు.. ఆకలితో చస్తుంటే ఆదుకున్న వారూ లేరు.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రాజెక్టుల పేరుతో భూములు అడుగుతున్నరు' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగయ్య పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారంలో హేసముద్రం భూనిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడారు. తరతరాలుగా సాగుచేసుకొని బతుకుతున్న భూములను గుంజుకోవడానికి ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆందోళనలను పోలీసులతో అణచాలని చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడ లేదన్నారు. ప్రజలకు అవగహన కల్పిండానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం ప్రయోగించి రాచరిక వ్యవస్థను తలపిస్తున్నారని ఆవేదన వ్యక్థం చేశారు. ప్రతిపక్షాలే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయనడం విడ్డూరంగా ఉంద న్నారు. భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే రైతుల అంగీకారం ఉండాలని తెలిపారు. బలవంతంగా గుంజు కుంటే రైతులు తిరుగుబాటు చేసి భూములను రక్షించు కుంటారని హెచ్చరించారు. 123 జీఓతో ప్రభుత్వం మోసం చేస్తే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమన్నారు.
ఏ ముఖంతో భూములడుగుతున్నారు
