సంజయ్ దత్, మనీషా కొయిరాల కలసి మరోమారు వెండితెరపై కనిపించనున్నారు. 'ప్రస్థానం' చిత్రం ద్వారా పదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. 90వ దశకంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇప్పుడు 2010లో విడుదలై విజయం సాధించిన తెలుగు సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సాయి కుమార్ పోషించిన పాత్రలో అక్కడ సంజయ్ దత్ నటిస్తున్నాడు. తెలుగులో రూపొందిన ఈ చిత్రంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ వారికి నచ్చేలా మార్చి రాస్తున్నారు రైటర్ ఫర్హద్ సమ్జి. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. అలీ ఫజల్, సంజయ్ దత్, మనిషా కొయిరాలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పదేళ్ల తర్వాత మళ్లీ...
