ఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న పరిణామాల నడుమ కాంగ్రెస్, ఎన్సీపీ అధినేతలు సోనియాగాంధీ, శరద్ పవార్ భేటీ కావడం ప్ర్రాధాన్యం సంతరించుకుంది. సోనియా నివాసంలోనే పవార్ ఆమెతో భేటీ అయ్యారు. అయితే వీరిద్దరూ ఏం చర్చించుకున్నారో తెలియలేదు. సోనియాతో సమావేశం కావడానికి ముందు పవార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తన రాజకీయాలు తాను చేస్తుంటే తమ రాజకీయాలు తాము చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఎన్సీపీతో చర్చిస్తున్నట్లు తనకు తెలియదని పవార్ చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్య పోయారు.
సోనియాతో పవార్ కీలక భేటీ
