అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మిషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పిల్లి సుభాష్, కన్నబాబు, మోపిదేవి, బాలినేని, ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు 45,20,616 మంది కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చామని, డిసెంబర్ 15 వరకు కౌలు రైతులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు.. సొసైటీల పేరుతో సాగుచేసుకుంటున్న రైతులకూ రైతు భరోసా కల్పించాలన్నారు. వ్యవసాయ భూ రికార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జగన్ అధికారులకు ఆదేశించారు.
వ్యవసాయ మిషన్పై ఏపీ సీఎం జగన్ సమీక్ష
