కటక్ (ఒడిశా) : ఒడిశా రాష్ట్రం కటక్ నగరంలోని మహానది ఒడ్డున బాలియాత్ర ఫెస్టివల్ ప్రారంభమైంది. పురాతన సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బాలియాత్ర ఫెస్టివల్ నిర్వహించారు. ఇండోనేషియా రాయబారి సిద్ధార్దో రెజా ముఖ్యఅతిధిగా పాల్గొన్న బాలియాత్ర ఫెస్టివల్ ను ఒడిశా రాష్ట్ర స్పీకర్ ఎస్ఎన్ పాత్రో ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా కళలు, సంస్కృతి, ఇంటి పరికరాలు, ఆహారపదార్థాలతో కూడిన వెయ్యి స్టాళ్లను ఏర్పాటు చేశారు. కన్నులపండువగా సాగిన ఈ ఫెస్టివల్ లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 8 రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాల్లో దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు.
కటక్‌లో బాలియాత్ర ఫెస్టివల్ ప్రారంభం
