ప్రజాశక్తి- బూర్జ
ఎన్ఎఫ్ఎస్ఎం పథకం(జాతీయ ఆరోగ్య భద్రత మిషన్)లో భాగంగా రైతులకు కంది విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ రైతులు పొలం గట్లుపై కందిసాగు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ కంది సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ ఎస్.అమరావతి, ఎంపిఇఒ శంకర్, రైతులు బెవర సూర్యనారాయణ పాల్గొన్నారు.
కంది విత్తనాలు పంపిణీ
