- జన చైతన్య వేదిక
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఎన్నికల్లో గెలిచిన పార్టీని వీడీ మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి కోరారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ను ఛైతన్యవంతం చేస్తేనే.. ఫిరాయింపులు నిరోధించగలుతామని అన్నారు.
పార్టీ మారగానే.. అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరణ చేయాలన్నారు. 'పార్టీ ఫిరాయిం పులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అంశంపై ఈ నెల 31న సదస్సు నిర్వహి స్తున్నామని తెలిపారు. సమావేశంలో చిదంబరరావు, ఎన్ శ్రీనివాసరెడ్డి, వీరన్న, హరిశంకర శర్మ పాల్గొన్నారు.
పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలి
